నేను కవిని
కాదన్నవాడిని
కత్తితో పొడుస్తా..

నాది కవిత
కాదన్న వాడిని
కర్రతొ కొడతా..

నా కవిత
చదవన్నన్న వాడిని
నా కవితతోనే చంపేస్తా..

నాకు కవితలు
వ్రాయడం రాదన్న వాడిని
రాళ్ళతో కొడతా..

నేను కవినన్న వాడికి
ఈ కవితనే
కానుకగా ఇస్తున్నా..