Monday, March 15, 2010



రాలి పోయే పూలకు ఏమి తెలుసు మిత్రమా స్నేహమంటే .


ఎంతో వేచి వేచి జీవితమంటే ద్వేషం పోయి ప్రేమ పుట్టుకు వస్తోంది.


ఇలా జరగటం కాకతాలియమా లేక యాద్రుచ్చికమా అనేది తెలియటం లేదు.


బతుకంతా నిన్ను తలుచు కోవటం తోనే సరి పోతోంది .


ఇక నిన్ను చేరుకోవటం అంతా పెద్ద కష్టం కాదు .మరణం నాలో అంతర్లీనమవుతోంది .


ఇది అనంతమైన అంతమే లేని పోరాతమైన ప్రేమ.


ఇందులో కోరికలు ఉండవు . ఒక్క వేచి చూడటమే తప్పా..


భౌతిక పరమైన ఈ లోకంలో హృదయాలతో పరిచయం పెంచుకోవటం అంటే


మరో సముద్రాన్ని ఈదటం అన్న మాట.


ఈ నేలపై వికసించే పూలను ప్రేమిద్దాం.


మదిలో నువ్వుగా రక్తమై కదలాడుతుంటే


పాటలోంచి పదం లీనమైనట్టు గా అగుపిస్తోంది.


ఇది హృదయం దీనికీ స్పందన ఉంది .


ఒక్క కోరికలు లేవు.


ఇలా జరగటం సాగి పోయే కాలంలా ...


రాలిపోయే నక్షత్రంలా నీ లోని హృదయం గంతులేస్తోంది.


నా కళ్ళ లోగిళ్ళలో కదిలే ప్రతి నిమిషం


నాలో మిగిలిపోయిన జ్ఞాపకాలను పంచుతోంది.


నీలోని చూపు నిర్మలమైన ఆకాశం


ఉదయమై రాత్రిని ముద్దాడాలని ఉవ్విళ్ళూరుతోంది.


విషాదంలోనూ నువ్వే ...


ఎటు తిరుగాడినా నువ్వే ...


ఇది సాగిపోయే నిరంతరమైన ప్రేమ..

No comments:

Post a Comment