Wednesday, March 10, 2010


నువ్వు వున్నా ప్రపంచం ..

కాలానికి అతీతంగా ఉంటుంది ..
కళలు ఫలించాలని కోరుకుంటుంది ..

ఎటు చూసినా ప్రేమ గాలులు వీస్తూ ఉంటాయి ..
హ్రిదయ గుసగుసలు వినిపిస్తూ ఉంటాయీ ..

మౌనానికి కూడా ఎన్నో అర్థాలు ఉంటాయి ..
సుషుప్తావస్థ లో యుగాలనుంది ఉండిపోయిన హ్రిదయాలు అగుపిస్తాయి ..

ప్రకృతి అంత ఒక పూల వనం లా ఉంటుంది ..
ప్రతి పువ్వు ఒక ఎర్ర గులాబీల కనిపిస్తుంది . .

ఆకాశం లో ఊహలు విహన్గాలై విహరిస్తూ ఉంటాయీ ..
ప్రేమ సంగమానికి దారులు వెతుకుతూ ఉంటాయి ..

వేకువ నే లేచిన ప్రియుల హ్రిదయాలు ..
ప్రేమ పిలుపులతో పరుగులేడుతుంటాయి ..

ప్రియ సాంగత్యం లో తాదాత్మ్యం చెంది అలసిన హ్రిదయాల రెప్పలు మూసుకుంటూ ఉఅతాయీ ..
మల్లె కలలో మధుర క్షణాల కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ..

కళలు కనే కళ్ళు ఏకాగ్రత తో పని చేసుకుంటూ పోతాయి ..
స్వప్న రాజ్యాలను నిర్మిస్తూ ఉంటాయీ ..

ఏఏ జన్మ లో ముదిపడలేని మనసలు ..
మరు జన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ..
అర్థర హ్రిదయాల తో .. సజల నేత్రాల తో ..
నా ఈ ఆవేదన నీకోసమే నేస్తమా
మీ చిన్న ఆవేదన రవికాంత్

No comments:

Post a Comment