Monday, March 15, 2010

నా వల్ల కాదు
నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు
నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు

వెన్నెల వెలుగులో
వాన చినుకుల్లో
సంద్రపు అలల్లో....
కలసి పంచుకున్న క్షణాలే కనిపిస్తున్నాయి

దూరమవుతున్నాననుకుంటూ
మరింత దగ్గరైపోతున్నాను.
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాను

ఇప్పటికి అర్దమయింది
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీ
నిన్ను కాదు అని...
మీ చిన్న ఆవేదన రవికాంత

No comments:

Post a Comment