Tuesday, May 18, 2010

నేనంటే నాకు చాలా ఇష్ఠం

నాకు నచ్చినదే మంచి

నా అలోచనే నా సిద్దాంతం

నాలోకపు ఏకచత్రాదిపతిని నేను

నాతో నేను నాకదే స్వర్గం

నేనంటే నాలోకమంటే ఈర్ష్య ఈ లోకానికి

నాపై ఒంటరినని ముద్రవేసి

నా ఒంటరితనం నేరమంటు యుద్దం ప్రకటించి

నాపై సామదానధండొపాయాలు ప్రయొగించి

నన్ను పెళ్ళి చెరలో బందించగ చూస్తున్నది ఈ లోకం"

1 comment: