Wednesday, September 29, 2010

అడుగడుగునా నా అంతరంగ అలజడుల అంతం ఎప్పుడు?
అనుభవ ఆవేదన సారంలో అర్ధం గ్రహించేదెప్పుడు?
పెరుగుతున్న దూరంలో గుండె చప్పుడు వేగం తగ్గేదెప్పుడు?
కరుగుతున్న ప్రేమలో ద్వేషం చల్లారెదెప్పుడు?
కనుపాప భావాల్లో ప్రేమ కన్నీళ్ళు ఆగేదెప్పుడు?
చేజారిన బ్రతుకుల్లో బాధల నీడలను వీడేదెప్పుడు?
నా అంతరంగ నిరంతర కవితల కడతీర్పుఎప్పుడు?
గమనం తెలియని గమ్యంలో కన్నీళ్ళ పయనం సాగేదెప్పుడు? మీ చిన్నవేదన
గుర్తించుకున్న గుర్తులు గుర్తుకొస్తుంటే
గుండెలో ఏదో గుబులవుతున్నది.

కనిపించని నువ్వు కదిలి రానంటుంటే
కన్నుల్లో కన్నీళ్ళు కారి పోతున్నవి
అందులో నీ రూపం కనుమరుగైపోతున్నది.

కల్లో కూడా కనిపించొద్దని నువ్వంటుంటే
బ్రతుకంతా బాధతో బరువై పోతున్నది.
.......మీ చిన్నవేదన
చెల్లి ప్రేమా....

నా ప్రేమ ఉలిచెక్కిన చక్కని శిల్పం నువ్వు
నా కవిత కు ప్రాణం నువ్వు
మాటల భావం నువ్వు
కన్నుల్లో ప్రతిబింబం నువ్వు
హృదయం లో అలజడి నువ్వు
గుండెల్లో చిరుసవ్వడి నువ్వు
నా మనసులోని ప్రేమవు నువ్వు
మీ అన్న చిన్నఆవేదనా ...
నేస్తమా .....
నినుచేరాలనే
ఆరాటం
అందుకే చీకటితో పోరాటం
నీ కన్నుల వెలుగులో నా పయనం
నా నీడే నా సైన్యం మీ చిన్న ఆవేదనా ...

Sunday, September 26, 2010

ప్రేమ

ప్రేమ ...
నిన్ను చేరిన ప్రతి మదిని గాయపరుస్తావు ,
నీకోసం పరితపించిన జంటలకు ఎడబాటుని మిగులుస్తావు ,
పూల ఋతువులా కనిపిస్తూనే బ్రతుకుని మోడు చేస్తావు ,
సంద్రం లా మురిపిస్తూనే ఎండమావిలా ఊరిస్తావు ,
ఇది నీవేనా ప్రేమా ....మీ చిన్న ఆవేదనా

Thursday, September 16, 2010

నేను గెలవటంలో ఓడిపోవచ్చు కానీ..
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను..
ప్రయత్నిస్తూ గెలుస్తాను..గెలుస్తాను