Monday, April 26, 2010

నేను నా ఈగో

నేను నా ఈగో
నేను అందరిలాగా
అమ్మయిలకోసం చేతులు కోసుకునే వాడిని కాదు
అమ్మయిలకోసం ఆత్మా హత్యలు చేసుకునేంత
బలహీనమైన వక్తినీ కాను.
నేను నన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తాను,
నేను నన్ను అభిమానించిన వారినే అభిమానిస్తాను,
నేను నన్ను గౌరవించిన వారినే గౌరవిస్తాను,
*నన్ను అర్ధం చేసుకోలేని వక్తి నన్ను అందుకోలేదు ,
నన్ను అర్ధం చేసుకున్న వక్తి నాకు ఆలి అవుతుంది. మీ చిన్నావేధన

Wednesday, April 21, 2010

చచ్చిన కర్రతో నన్ను కాల్చి చంపకు నేస్తమా ;
నా సర్వస్వం నివే అనుకునాను నేస్తం .
ఆకాశం చినుకును రాల్చకున్న నెల ఆశగా
ఆత్మవిశ్వాసం తో ఎదురు చుస్తునేవుంటుంది నేస్తం .
ఎదుకంటే ఎపుదోకపుడు దాహాని తిరుస్తుందేమో అనీ .
అందుకే నేను ఆశగా నా ఆత్మవిశ్వాసం తో నీవు .
నామీద జాలిచుపుతవని నీకోసమే ఎడురుచుస్తువుంటాను .
నేస్తమా న్ను అర్ధం చేసుకోవా . మీ చిన్ని ఆవేదనా

Monday, April 12, 2010

స్నేహ మాధుర్యం

హ్రుదయం అనే తపాలాబిళ్ల మీద
స్నేహం అనే పోస్టల్ ముద్ర వేశి
ఎంచక్కా ఎటో వెళ్లిపోయావు
నేనెటు వెళ్లేది
చిరునామా వ్రాయనిదే
మీ చిన్న ఆవేదనా
కళ్ళు ముస్తే కలలలో ...
కళ్ళు తెరుస్తే ఇలలో ....
ప్రతి పూవులో నీ నవ్వు అనుక్షణం కవిస్తువుంటే .
స్వందించే నా ఈ గుండె చపుడు నీకు .
వినిపెంచేదేపుడు నేస్తమా ?
మీ చిన్న ఆవేదనా

Thursday, April 1, 2010

నాకు ఉన్నా ఆశ నీవు నా దానివి కావాలని
మరి ఎందుకు ఆ దేవుడు నన్ను నీకు దూరం చేసాడు
దేవునికి తెలియదా ప్రేమంటే
తెలిసి ఎందుకు కలిగించాడు ప్రేమ అనే అను భావాన్ని
మీ చిన్న వేదన
ఇన్నాళ్ళు నిన్ను దాచిన నా హృదయం
ఇక నీవు తనలో లేవని
ఎప్పటికి తిరిగి రావేమోనని
ఎదురుచుడలేక
ఎప్పుడు ఆగిపోతుందో ఏమో ?
కరుణించి నను కాపాడు
కాదంటే నీవే నన్ను చంపు
మీ చిన్న ఆవేదనా
నయ వంచన చేసి
నన్ను వదిలి వెళ్ళావు
నిన్నే నమ్ముకుని
నేను మోస పోయాను
ఎవ్వరికి చోటివ్వనని
నీకు మాట ఇచ్చాను
ఎన్నటికి నిను వీడనని
నీతో బాస చేశాను
ఇక నుండి ఒంటరిదే జీవితం
ఇక నా గుండెల్లో మిగిలేది శూన్యం
మీ చిన్న ఆవేదన
నీవు దూరమైన ,నన్ను దూరం చేసుకున్నా
నీపై అభిమానం ,నన్ను నీ దగ్గరే ఉంచింది
ఆనందాన్ని పంచి ,అభిమాన్నాన్ని చూపి
ఆపై నీ ప్రేమలో నన్ను మరిపించి
జంటగా మారి జోరుగా కాపురమే చేద్దామని
జీవితం లో నన్ను చూడనని
ఒక్కసారిగా నన్ను ఒంటరిని చేసావు
నిన్ను వెతికిన నా కనులు
నను మరచి పోయాయి
నీవు తప్ప నాకెవరు
కనిపించకున్నాయి
లోకమంతా నీవే అయినా
లోటు అయినది నీ ప్రేమే
కను సనుల్లో నిండిన నీవు
నా జీవితమంతా తోడుగా రాలేవా?
ఏడేడు లోకాల నిండిన ప్రేమ
ఏడు జన్మ లకు నీ తోడుని ఇవ్వలేవా
రాధేయ విధేయుడుగా నేను నీ కోసం
ధిక్కరించను నీ మాట నీ సంతోషం కోసం
కన్నీరు చిందించనీయను కలలోనైనా
నీలి కురులకు ముడి వేసుకుంటావో
కోరుకుని మరీ నీ గుండెల్లో దాచుకుంటావో
సంతసించి నీకు కనువిందు చేస్తాను
నేను నీలో సగ భాగ మవుతాను
నుదుట తిలకం దిద్ది కడదాకా తోడు ఉంటాను
నా హృదయం లో నిన్ను దేవతగా ప్రతిష్టించి
నా మనసునుని నైవేద్యంగా అర్పించి
నీ ప్రేమ కోసం నిన్ను పూజిస్తున్నాను
నా పూజకు మెచ్చి ఆ దైవం వరం ఇస్తాడు కాని
నీ ప్రేమ నాకు దక్కకుంది
నేను నిన్ను ప్రేమించాను
నన్ను మించి నిన్ను ప్రేమించాను
గుడిలో దేవతలా ఆరాదించాను
దారి చూపే ఆత్మీయ నేస్తంలా పూజించాను
నీ తోనే జీవితాంతమని నమ్మాను
కలలో కూడ నాకు దూరం కావద్దని కోరుకున్నాను
కన్నీటిలో కరిగిపోవద్దని గుండెల్లో దాచుకున్నాను
కాని గుండెనే కరిగించి ,కన్నీటిని మిగిల్చి నాకు దూర మయ్యవు
మీ చిన్న ఆవేదన
అన్ని నీతో కోరుకుని అన్నినీతో కావాలనుకుని
జీవితం నీతో నే అంతం కావాలనుకుని
దేవుణ్ణి దీనంగా వేడుకున్న
దేవుని దీవెన దక్కలేదు.
నా దేవతా నాకు దక్కలేదు
మరుపు రావు మధుర క్షణాలు
మారలేదు నా మనసు
ఇంకా ఏదో ఆశ
వరంగా నీవు వస్తావని
అవును అనడానికి ఆనందం ఎక్కడుంది
కాదు అనడానికి కారణాలేమి ఉన్నాయి
కలిసి ఉందామనుకున్నది ఒక కల
విడి పోయామన్నది కల కాకుడని ఒక నిజం
దేవుడు నా దేవతను దూరం చేసాడని నిందించనా
దేవుని రూపం లో ఇదంతా చేసిన మనిషిని దూశించనా
మంచి చేసింది మనిషికా ,మనసుకా ఈ కాలం
కాకా వికలం చేసి కదలదే మంచి కోసం ఈ కాలం
పగిలిపోయిన హృదయానికి ఔషధం ఉందా?
పగల గొట్టిన దేవునికి హృదయం అంటు ఉందా?
జీవితానికి ఆశ అని నిను చూపి
జీవితానికి అడియాషగా నిన్ను దూరం చేశాడు
గోపాల బాలునిగా గోపికలకే కృష్ణుడు
ఏక పత్ని వ్రతుడిగా సీతకే రాముడు
ప్రేమను పంచడానికే రూపాలు మార్చిన గోవిందుడు
నా ప్రేమ గెలవకుండా, మరొకరి ప్రేమను పొందకుండా ఒంటరిని చేశాడు
ఆవేదన అర్థమైతే ఆలోచించక వరమివ్వు
ఆనందం నాకు సొంతం చేసే నా ప్రేమను నాకు దక్కనివ్వు.
ప్రేమను ప్రేమించినంతగా
విరహాన్ని ప్రేమించగలగాలి
నేటి కలి కాల ప్రేమికుడు
ఎవరికీ తెలుసు ఎప్పుడు ఎలా మారెనో ప్రేయసి మనసు
ఎన్ని తిప్పలు పెట్టి ఎంత దూరం చేసుకుంటుందో
దేవుడు చేసిన పని అని నీ దేవత్ నీకు దూరమైతే
తట్టుకో గలగాలి కదా ప్రేమికుడు
మీ చిన్న ఆవేదన
సారధ్యపు ప్రగతికి సాధన కావాలి
సాధించే మనసున్న స్వాగతించే హృదయం కావాలి
సాహసించి చేరుకున్నా సమస్యలను అధిగమించాలి
సమస్యను ఎదుర్కొన్నా పరిష్కారం న్యాయంగా ఉండాలి
సారూప్యత లేకుండా అందరినీ సంతోష పెట్టాలి .
మీ చిన్న ఆవేదన
ఆది భిక్షువే అడిగి ఉంటే ప్రేమను భిక్షగా
ఆది శక్తి ఇచ్చేదా ప్రేమను వరంగా?
అపర్ణ పరాశక్తి చేస్తేనే కదా కఠోర దీక్ష
ప్రసాదించాడు వరాన్ని అర్థ నారీశ్వరుడుగా
ఎన్నటిదో ఆ వరం ప్రేమని చేసాడు ప్రేయసికి ఆధీనం
మీ చిన్న ఆవేదన
గుప్పెడంత గుండెకి ప్రేమ ఓ ఉప్పెన
గూడు చెదర గొట్టి కన్నీటిని మిగులుస్తుంది
గుండెల్లో నింపుకున్న ప్రేమ ప్రాణంగా ఉంటే
ప్రేమించే ప్రేయసి ఆయువును నింపుతుంది
ప్రేమ పిచి వాన్ని చేసే ప్రేయసి ఉంటే
ఆ ప్రేమే ప్రియుడి ప్రాణాలు తీస్తుంది
మీ చిన్న ఆవేదన

ఎందుకిలా చేశావు

ఎదను వదిలి ఎందుకు వెళ్ళావు
ఇన్నేళ్ళ మన అనుభందాన్ని
ఇలా దూరం చేసావు
పరిమళించిన మనసుకు
పాడి ఎందుకు కట్టావు
మనసు లోని మందిరం వదిలి

మాసి పోయిన మంటపాన్ని మిగిల్చినావు
ప్రేమను జయించి పెళ్లి చేసుకున్దామను కుంటే
ఓడించి ఒంటరి తనాన్ని మిగిల్చినావు
అభిమానాన్ని పంచేది
ఆనందాన్ని ఇచ్చేది నీనైతే
అలుసుగా చూసేది
ఆత్మీయతను చంపేది నీవు
చూపించిన ప్రేమనంతా
ఛీ కొట్టి పోయావు
మురిసిన మనసులో అంత
అలజడే సృష్టించావు
చచ్చిన పామునే చావా బాదే
ఖతినాత్మురాలిగా మారావు.
నేస్తమా ఎదుకు ఎలాచేస్తునావు మీ చిన్న ఆవేదన రవి

నువ్వు దూరమైతే

నువ్వు దూరమైతే దూరమైంది కేవలం ఆనందం. నీ మీద ప్రేమ కాదు.
అదే నువ్వు పక్కన ఉంటె…… స్వర్గం,
నిన్ను చుసిన నా ఈ కళ్ళలో, స్వర్గం,
నీ ఛాయను అంటి ఉన్న ఈ నెలలో, స్వర్గం, నీ తోడు లోనీ ఈ సఖ్యము లో, స్వర్గం, నన్ను నేను చూసుకుంటున్న నీలో నేస్తమా న్ను అర్ధమా చేసుకోమ
మీ చిన్న ఆవేదన

ప్రేమ


కనులుకనులు కలిస్తేనే ప్రేమ
మాటామాట కలిస్తేనే ప్రేమ,
శ్వాస శ్వాస కలిస్తేనే ప్రేమ,
మనసుమనసు కలిస్తేనే ప్రేమ,
తనవు తనవు కలిస్తేనే ప్రేమ ,
పుట్టుకేగని చావులేనిది ప్రేమ ,

రెండు హృదయాల మధ్య వారది ప్రేమ ,
రెండు జీవితాలను కలిపేది ప్రేమ ,

మధురను బుతిని ఈచేది ప్రేమ ,
ఎపుడు. ఎలా. ఎక్కడ. పుతుతుందో తెలియనిదే ప్రేమ,


మీ చిన్న ఆవేదన

కరిగి పోయేకాలానికి

కావ్యం లాంటి నా జీవితంలో కరిగి పోయేకాలానికి,
చెరిగిపోయే రాతలకు మిగిలిపోయే ఒకే ఒక తీయనిజ్ఞాపకం నీతో స్నేహం
నేస్తమా న్ను అర్ధం చేసుకోవా ....మీ చిన్న ఆవేదన